Read about the great mind of Indians
BRAIN OF INDIAN.
IT IS NOT A STORY BUT A TRUE INCIDENT THAT HAPPENED IN AMERICA.....
An Indian man walks into a bank in New York City and asks for the loan
officer. He tells the loan officer that he is going to India on business
for two weeks and needs to borrow $5,000.
The bank officer tells him that the bank will need some form of security
for the loan, so the Indian man hands over the keys of a new Ferrari parked
on the street in front of the bank. He produces the title and everything
checks out. The loan officer agrees to accept the car as collateral for the
loan.
The bank's president and its officers all enjoy a good laugh at the Indian
for using a $250,000 Ferrari as collateral against a $5,000 loan. An
employee of the bank then drives the Ferrari into the bank's underground
garage and parks it there.
Two weeks later, the Indian returns, repays the $5,000 and the interest,
which comes to $15.41.The loan officer says, "Sir, we are very happy to
have had your business, and this transaction has worked out very nicely,but
we are a little puzzled. While you were away, we checked you out and found
that you are a multi millionaire. What puzzles us is, why would you bother
to borrow "$5,000"
The Indian replies: "Where else in New York City can I park my car for two
weeks for only $15.41 and expect it to be there when I return'"
Ah, the mind of the Indian.......
This is why India is shining.......
Thursday, 12 July 2007
Tuesday, 10 July 2007
try this... its really interesting
http://www.subservientprogrammer.com/main.aspx
Connect to this link. u will c a person sitting in front of the computer.
Type the words like "LAUGH" in the dispatch?..the person will do that action
Like that u type "CRY, DANCE, RUN, THROW,BREAK ,STAND,WHAT,VOMIT,EAT,DRINK ?etc..whatever u like. But it should be a single word ,
(It works only in Internet Explorer)

Monday, 9 July 2007
Very Inspiring and touching ....
A few weeks ago NIMH (National Institute of Mentally Handicapped , Hyderabad, INDIA) had conducted a sports meet for all the Physically & mentally handicapped children at National Stadium Hyderabad. In one race.., Nine contestants, all physically or mentally disabled, assembled at the starting line for the 100-yard dash. At the gun, they all started out, not exactly in a dash, but with a relish to run the race to the finish and win. All, that is, except one little boy who stumbled on the asphalt, tumbled over a couple of times, and began to cry. The other eight heard the boy cry. They slowed down and looked back. Then they all turned around and went back......every one of them. One girl with Down's Syndrome bent down and kissed him and said, "This will make it better." Then all nine linked arms and walked together to the finish line. Everyone in the stadium stood, and the cheering went on for several minutes. People who were there are still telling the story. Why?? Because deep down we know this one thing: What matters in this life is more than winning for ourselves. What matters in this life is helping others win, even if it means slowing down and changing our course. If you pass this on, we may be able to change our hearts as well as someone else's. "A candle loses nothing by lighting another candle" Please tell others about it - at least to the people who will understand the meaning of the message.

The professor of a university challenged his students withthis question. "Did God create everything that exists?" A studentanswered bravely, "Yes, he did".
The professor then asked, "If God created everything, then he createdevil. Since evil exists (as noticed by our own actions), so God is evil.The student couldn't respond to that statement causing the professor toconclude that he had "proved" that "belief in God" was a fairy tale, andtherefore worthless.
Another student raised his hand and asked the professor, "May I pose aquestion? " "Of course" answered the professor.
The young student stood up and asked : "Professor does Cold exists?"
The professor answered, "What kind of question is that?...Of course thecold exists... haven't you ever been cold?"
The young ! student answered, "In fact sir, Cold does not exist. Accordingto the laws of Physics, what we consider cold, in fact is the absence ofheat. Anything is able to be studied as long as it transmits energy(heat). Absolute Zero is the total absence of heat, but cold does notexist. What we have done is create a term to describe how we feel if wedon't have body heat or we are not hot."
"And, does Dark exist?", he continued. The professor answered "Of course". This time the student responded, "Againyou're wrong,Sir. Darkness does not exist either. Darkness is in fact simply the absence of light.Light can be studied, darkness can not. Darkness cannot be broken down. A simple ray of light tears thedarkness and illuminates the surface where the light beam finishes. Dark is a term that we humanshave created to describe what happens when there's lack of light."
Finally, the student asked the professor, "Sir, does evil exist?" The profes! sor replied, "Of course it exists, as Imentioned at the beginning, we see violations, crimes and violence anywhere in the world, and those things are evil."
The student responded, "Sir, Evil does not exist. Just as in the previous cases, Evil is a term which man has createdto describe the result of the absence of God's presence in the hearts of man.
After this, the professor bowed down his head, and didn't answer back.
The young man's name was ALBERT EINSTEIN.

Thursday, 5 July 2007
తళ్ళికోట యుద్ధము
ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్క సారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచు యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 నుండి 1565 వరకు విజయనగరంపై విజయం, సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు 1520 మే 19న బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్‌షాను చిత్తుగా ఓడించి రాయిచూరును స్వాధీనం చేసుకున్న తరువాత విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, సుల్తాను తన పొరుగున ఉన్న ముస్లిం రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. రాయచూరు ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పుతో పాటు సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది.
ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. వీరి తగాదాల్లో రామరాయల సహాయం వారడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్‌షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్‌షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో హుసేన్ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్‌షా కలిసి అలీ ఆదిల్‌షా పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్‌షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని కళ్యాణి వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్‌షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్‌షా అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.
సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇచ్చేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ఐతే ఈ విషయం మీద చరిత్రకారులలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరి చరిత్రకారుల ప్రకారం రామరాయలు ముస్లిములు నివసించే ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను అవమానించేవాడని చెబుతారు. కాని కొందరు ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేక ముస్లిములు పనిచేసేవారనీ,రామరాయలు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చేవాడని కొందరు అంటారు.
విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. అందరు దక్కన్ సుల్తానులు కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయ నగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షా చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయం లొ ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్‌షా తో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి ఆలీ ఆదిల్ షా కు హుస్సేన్ షా మధ్య సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలిని హుసేన్‌షా కొడుకు పెళ్ళి చేసుకున్నాడు.
విజయనగరాన్ని పతనం చేయడానికి రామరాయలతో చెలిమిని ఆలీ ఆదిల్‌షా తుంచుకొనే ఎత్తుగడ వేశాడు. ఈ ఎత్తుగడ భాగం గా ఆదిల్ షా తన వద్ద నుండి తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయవలసిందిగా కోరుతూ రామరాయలు వద్దకు ఒక ఒక రాయబారిని పంపాడు. ఆదిల్‌షా ఊహించినట్లు గానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. రాయబారం తిరస్కరించడంతొ యుద్ధం మొదలు పెట్టేందుకు ఒక కారణం కూడా సమకురింది
యుద్ధ భూమి
తళ్లికోట యుద్ధం ఈ పటములో చూపించిన వివిధ ప్రదేశాలలో జరిగినది భిన్నాభిప్రాయాలు ఉన్నవి
ఈ యుద్ధ సంగ్రామ స్థలం పై అనేక వాదనలు ఉన్నాయి. ఈ యుద్ధం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని కొందరు , కాదు తళ్ళికోట వద్ద జరిగిందని కొందరు వాదిస్తారు. అయితే ఈ రెండు ప్రదేశాలు కాదని మరో రెండు వాదనలు ఉన్నాయి. రామరాజ్ఞ బఖైర్ మరియు కైఫియత్ల వంటి సాంప్రదాయక హిందూ రచనలు, మూలాలు యుద్ధము రాక్షసి తంగడి వద్ద జరిగిందని. ఫరిస్తా మొదలగు ముస్లిం చారిత్రికులు తళ్లికోట వద్ద జరిగిందని అభిప్రాయపడ్డారు.
దుర్గా ప్రసాదు అభిప్రాయం
విజయనగర సైన్యం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య మైదానంలో విడిది చేసింది. సుల్తానుల సమైక్య సైన్యం తళ్ళికోట అనే గ్రామం వద్ద విడిది చేసింది. యుద్ధం మాత్రం ఈ రెండు ప్రాంతాల మధ్య గల బన్నిహట్టి అనే ప్రదేశంలో జరిగింది.
రాబర్ట్ సెవెల్ అభిప్రాయం
తళ్ళికోట కృష్ణకు 25 మైళ్ళు ఉత్తరాన ఉన్నది. కానీ యుద్ధం, కృష్ణకు దక్షిణాన రామరాయలు విడిది చేసిన ముద్గల్ నుండి పది మైళ్ల దూరంలో జరిగింది. సుల్తానుల కూటమి కృష్ణానది వంపులో ఇంగల్గి గ్రామము వద్ద దాటి ఉండవచ్చు. కాబట్టి యుద్ధం ఇంగలిగి గ్రామం నుండి ముద్గల్ పోయే దారిలో భోగాపూర్ (బాయాపూర్) అనే గ్రామం వద్ద జరిగి ఉండవచ్చు.
యుద్ధ వివరణ
నలుగురు సుల్తానులు తమ సైన్యాలను బీజాపూరు సమీపంలోని ఒక మైదాన ప్రాంతంలో కలిపారు. 1564 డిసెంబర్ 25 న ఈ కూటమి సైన్యాలు దక్షిణ ముఖంగా ప్రయాణించి కృష్ణకు 25 మైళ్ళ దూరంలోని తళ్ళికోట గ్రామం వద్దకు చేరు కొన్నాయి.ఆ కూటమి సైన్యాలు చాలా రోజుల పాటు అక్కడే విడిది చేశాయి.
అక్కడ విజయనగరములొ రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. తన తమ్ముళ్ళు తిరుమల రాయలు , వెంకటాద్రి రాయలు ల సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి, తంగడి గ్రామాల మధ్యన సైన్యాన్ని మోహరించాడు. సుల్తాను సైన్యం నదిని దాటే అవకాశము గల అన్ని చోట్ల కాపలాను పహారా ను ఏర్పాటు చేశాడు.
అయితే సుల్తానుల సైన్యం నది దిగువగా ప్రయాణం చేస్తున్నట్లు రామరాయల సైన్యాన్ని బొల్తా కొట్టించి, ఒకరాత్రి వేళ నదిని దాటడం ప్రారంభింది. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజున - 1565 జనవరి 23 (ఫరిష్తా యుద్ధం జరిగిన తేదీని జనవరి 23 గా గుర్తించాడు. రాబర్ట్ సెవెల్ కూడా తన పుస్తకంలో అదే తేదీని తీసుకున్నాడు.) - రెండు పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు ఆలీ ఆదిల్‌షాను , మధ్యన రామరాయలు హుసేన్ నిజాంషాను , కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, ఆలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహ రచన చేశాడు.దక్కన్ సుల్తానుల కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఈ ఫిరంగులను కప్పిపుచ్చుతూ రెండువేలమంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాల వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపైకి దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకుని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన ఫిరంగి దాడులతో విజయనగర సైన్యం వెనకడుగు వేసింది.
పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో రెండువైపులోని కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. మధ్య భాగం లోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటు రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకిని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించి, సుల్తాను ముందు హాజరు పరచింది. హుసేన్‌షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు.
తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కు నగరానికి పారిపోయాడు.

మాయాబజార్
కథా వస్తువు
ఇదే కథ తో 1936 సంవత్సరం లో శశిరేఖా పరిణయం పేరు తో ఒక చిత్రం రూపొందించబడింది. దానికి మాయాబజార్ అని మరొక పేరు. అదే పేరుని ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే, మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ, ఈ చిత్ర కథావస్తువు.
దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు.
మాయాబజార్ ప్రశస్తి
సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, ఈ చిత్రము ఒక మహాద్భుతమని చెప్పవచ్చు. మాయాబజార్ సినిమా కోసం పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు అజరామరంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి.
మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్ల గా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది!
ఈ చిత్రానికి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితులయ్యారు. 4 యుగళగీతాలకు స్వర కల్పన చేసాక, కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు. రాజేశ్వరరావు కట్టిన బాణీలకు వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసారు ఘంటసాల. ఘంటసాల , పి.లీల , పి.సుశీల , మాధవపెద్ది సత్యం మొదలగు వారి నేపధ్య గానంలో వచ్చిన , నీవేనా నను తలచినది, చూపులు కలసిన శుభవేళా, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునదీ, సుందరి నీవంటి, ఆహ నా పెళ్ళీ అంటా, వివాహభోజనంబు వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. చమత్కారమేమిటంటే ఈ పాటల పల్లవులు తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకోబడ్డాయి. ఆలాగే లాహిరి లాహిరి లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు (ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ , గుమ్మడి) ఘంటసాల పాడటం ఒక ప్రత్యేక విశేషం.
ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని. మచ్చుకు కొన్ని:
అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కొండ మీద దూకగానే ఆ అదటుకు కొండకొమ్ము విరిగి పడడమూ,
మాయామహల్లో కంబళి లా కనిపించే గింబళి తనంతట తనే చుట్టుకోవడం,
తల్పం లాంటి గిల్పం గిరగిరా తిరిగి క్రిందపడదోయడం లాంటి విడ్డూరాలు,
ఘటోత్కచుడి "వివాహభోజనం"బు షాట్లు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
పాత్రలు వాటి స్వభావాలు, పాత్రధారులు
ఘటోత్కచుడు
మొదటిసారి చూసినప్పుడు అభిమన్యుడెవరో తనకు తెలియకపోయినా "బాలకా! నీ మీద ఏలనో ఆయుధము ప్రయోగించడానికి చేతులు రావడము లేదు" అని అనురాగం ప్రకటిస్తాడు. రాక్షస విద్యార్థులు 'దుష్టచతుష్టయం' అనే మాటలో ఒత్తులు సరిగా పలకలేక విడివిడిగా 'దుసట చతుసటయం' అని పలుకుతూంటే ఆ తప్పుని సరిదిద్దక దుర్యోధనాదుల్ని గుర్తు చేసుకుని పళ్ళు కొరుకుతూ "వాళ్ళనలాగే విడివిడి చేసి పొడిపొడి చేసెయ్యాలి." అని సమర్థిస్తాడు.
"వివాహభోజనంబు" పాటయ్యాక ఘటోత్కచుడు పెళ్ళివంటకాలన్నీ చూసి ఆత్రం పట్టలేక తొందరగా తినెయ్యాలని గద పక్కన పెట్టి వొళ్ళు పెంచి కూర్చుంటాడు. అన్నీ ఖాళీ చేశాక గద కోసం తడుముకుంటే అది చేతికందనంత చిన్నదిగా ఉంటుంది. ఆ సందర్భంలో ఆ రాక్షసుడు ముందు తికమక పడి, నిదానంగా విషయం అర్థమైనట్లు తలాడిస్తాడు. అలాగే చివరి ఘట్టంలో తన అనుచరులు కౌరవులను చావబాదుతున్నప్పడు "ఆహా! ఆర్తనాదములు శ్రవణానందముగానున్నవి" అని తన రాక్షస ప్రవృత్తిని ప్రకటిస్తాడు.
రేవతి
సాత్యకి రాజసూయ యాగం నుంచి తిరిగొచ్చి మయసభ గురించి వర్ణిస్తూంటే, రేవతి "వనాలూ, తటాకాలూ కూడా మణిమయాలేనా?" అని ఆశగా, ఆశ్చర్యంగా అడుగుతుంది. ప్రియదర్శినిలో ఆమెకు ప్రియమైన వస్తువులుగా మణులు, బంగారం కనిపిస్తాయి. అయితే, ఆ నెపాన్ని రుక్మిణి మీదకు నెట్టేస్తుంది: "ఏమో, నాపక్కన నువ్వున్నావు. నువ్వనుకున్నది కనిపించిందేమో?" అని. పాండవులు రాజ్యం కోల్పోగానే, వాళ్ళ సంబంధం వదులుకోవడానికి ఏ మాత్రమూ సంకోచించని దానిగా ఆమె ధనాశను, అవకాశవాద తత్వాన్ని ఇక్కడ ఈ రెండు మాటల్లోనే సూచించారు.
అప్పటిలో ఈ సినిమాకు 26 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యింది. అంత ఖర్చు పెట్టి తీయడం విజయావారికే సాధ్యమయ్యింది. విజయావారి సినిమాలో నటించడం నటీనటులకొక ప్రతిష్టాత్మక విషయంగా భావించేవారు. చాలా మంది కోరిక ఈ మాయాబజార్ సినిమాతో సఫలమయ్యంది. ఈ సినిమాలో నటించిన కొందరు కళాకారులు.
పాత్ర
పాత్రధారి
వ్యాఖ్య
కృష్ణుడు
ఎన్.టి.ఆర్
అంతకు ముందు ఒక సినిమాలో వేసిన కృష్ణుని పాత్రకు మంచి స్పందన రాలేదు. కనుక ఈ సినిమాలో చాలా జాగ్రత్త తీసుకొని ఎన్.టి.ఆర్.కు ఈ పాత్ర, మేకప్ రూప కల్పన చేశారు. తరువాత కధ ఎవరికి తెలియదు?
అభిమన్యుడు
ఏ.ఎన్.ఆర్
శశిరేఖ (బలరాముని కుమార్తె)
సావిత్రి
ఘటోత్కచుడు
ఎస్.వి.రంగారావు
ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ వల్ల తెలుగువారికి ఘటోత్కచుడు చాలా ప్రియమైన వ్యక్తి ఐపోయాడు.
లక్ష్మణ కుమారుడు
రేలంగి
లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కధలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. కాని ఇది "మాయ" బజార్ కదా?
చిన్నమయ
రమణా రెడ్డి
బలరాముడు
గుమ్మడి వెంకటేశ్వరరావు
కృష్ణుడు, బలరాముడు అన్నదమ్ములన్న విషయానికి ప్రాముఖ్యతనివ్వడం కోసం ఒక సీనులో దర్శకుడు ఎన్.టి.ఆర్., గుమ్మడిల ముక్కులలో పోలికలను చూపడానికి ప్రయత్నించారట!
దుర్యోధనుడు
ముక్కామల
శకుని
సి.ఎస్.ఆర్
రేవతీ దేవి (బలరాముని భార్య)
ఛాయా దేవి
సుభద్ర
ఋష్యేంద్రమణి
ఋష్యేంద్రమణికి మొదట రేవతి పాత్ర ఇచ్చారట. కాని గర్విష్టి పాత్ర తనకు ఇష్టంలేక చక్రపాణిని సుభద్ర పాత్ర అడిగి తీసుకొన్నానని ఒకసారి ఋష్యేంద్రమణి టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది.
రుక్మిణి
సంధ్య
ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత తల్లి.
సాత్యకి
నాగభూషణం
కర్ణుడు
మిక్కిలినేని
దుశ్శాసనుడు
ఆర్.నాగేశ్వరరావు
రథ సారది
వల్లూరి బాలకృష్ణ
చిన్నారి శశిరేఖ
సరస్వతి
బాల నటి
చిన్నారి అభిమన్యుడు
ఆనంద్
బాల నటుడు
లంబు
చదలవాడ కుటుంబరావు
జంబు
నాల్ల రామ్మూర్తి
పల్లెటూరి పిల్ల చ్రిత్రంలో లప్పం పాత్రధారి
ధూళిపాళ
మోహన
భానుమతి (దుర్యోధనుని భార్య)
రజని
కృష్ణుడు
కంచి నరసింహారావు
కృష్ణుడు మాయా రూపంలో ఉండి అటు నేనే ఇటు నేనే పాట పాడే పాత్రధారి
శర్మ
అల్లు రామలింగయ్య
దారుకుడు
మాధవపెద్ది సత్యం
శాస్త్రి
వంగర వెంకటసుబ్బయ్య
యశోద
బెజవాడ రాజారత్నం
వినవమ్మా యశోద పాటలో
చిన్ని కృష్ణుడు
బాబ్జీ
వినవమ్మా యశోద పాటలో
సీత
సీత
అలనాటి నటీమణి.
మరిన్ని 'మాయ'లు
అభిమన్యుడి పెళ్ళి చుట్టూ మూడు గంటల సేపు కథ నడిస్తే పాండవులెక్కడా కనిపించకపోయినా వాళ్ళేమయారనే అనుమానమెక్కడా ప్రేక్షకులకు రాలేదంటే అది దర్శకుడు పన్నిన మాయాజాలమే.
"అహ నా పెళ్ళంట.." పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాధవపెద్ది సత్యం కాదు. ఘంటసాల.
"దురహంకార మదాంధులై.." అనే పద్యానికి ముందు వచ్చే "విన్నాను మాతా విన్నాను.." అనే సుదీర్ఘమైన డైలాగ్ ను పలికింది రంగారావు కాదు. మాధవపెద్ది సత్యం.
ఆశ్చర్యం: ఈ సినిమాలో కర్ణుడికి అసలు కవచ కుండలాలే లేవు.
ఈ చిత్రంలో ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం , భళి భళి భళి భళి దేవా గీతంలో రథసారథి పాత్రలో కనిపించి మనల్ని అలరిస్తారు.
పాటలు. పద్యాలు
ఈ సినిమాలో హిట్టయిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు అసలు సంగీత దర్శకుడు. (చూపులు కలసిన శుభవేళా, నీవేనా నను తలచినది, లాహిరి లాహిరి లాహిరిలో, నీ కోసమె నే జీవించునది) కానీ చక్రపాణితో వచ్చిన విభేదాలవలన సాలూరు తప్పుకొనగా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల అందించాడు. అయితే సినిమా టైటిల్స్‌లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు.
పాట / పద్యం
గీతరచన
నేపథ్యగానము
నీవేనా నను తలచినది
ఘంటసాల వెంకటేశ్వరరావు
లాహిరి లాహిరి లాహిరిలో
ఘంటసాల వెంకటేశ్వరరావు
వివాహ భోజనంబు
మాధవపెద్ది సత్యం
అహనా పేళ్ళంట
భళి భళి భళి దేవా
మాధవపెద్ది సత్యం
చూపులు కలసిన శుభవేళ
ఘంటసాల వెంకటేశ్వరరావు
నీకోసమె నే జీవించునది
ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఘంటసాల వెంకటేశ్వరరావు
దయచేయండి దయచేయండి
విన్నావటమ్మా ఓ యశోదమ్మా
వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా
ఎమ్.ఎల్.వసంతకుమారి
అఖిల రాక్షస మంత్ర (పద్యం)
లల్లిలలా లల్లిలలా
ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా సొగసు
అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై (పద్యం)
మాధవపెద్ది సత్యం
దురహంకార మదాంధులై ఖలులు విద్రోహంబు కావించిరే (పద్యం)
మాధవపెద్ది సత్యం
శకునియున్న చాలు శనియేల అని గదా (పద్యం)
సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
ఎన్ని మాయాబజార్లు?
అసలు మహాభారతంలో లేని ఈ కధ భారతీయ సినిమా వారికి బాగా ఇష్టమైన కధావస్తువు అనిపిస్తుంది. మొత్తం పదికి పైగా సినిమాలు ఈ ఇతివృత్తంతో వచ్చాయి.
మూగసినిమాల కాలంలో "మాయాబజార్" లేదా "సురేఖా హరన్" - 1925లో విడుదలయ్యింది. బాబూరావు పైంటర్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో కధానాయకుడు శాంతారాం.
అదే పేరుతో 1932లో నానూభాయి పటేల్ దర్శకత్వంలో వచ్చింది.
అదే సినిమా తమిళంలో "మాయాబజార్" లేదా "వత్సల కళ్యాణ్" గా వచ్చింది. తమిళ రూపకానకి ఆర్.పద్మనాభన్ దర్శకుడు.
పి.విదాస్ దర్శకత్వంలో 1935లో "మాయాబజార్" లేదా "శశిరేఖా పరిణయం" పేరుతో తెలుగు సినిమాగా వచ్చింది. ఇందులో శశిరేఖగా శాంతకుమారి నటించింరది.
మరాఠీ మాయాబజార్ జి.వి.పవార్ దర్శకత్వంలో 1939లో వచ్చింది.
ధర్మదత్తాధికారి దర్శకత్వంలో "మాయాబజార్" లేదా "వత్సలా హరన్" గా 1949లో హిందీ, మరాఠీ భాషలలో తీశారు.
నానాభట్ సినిమా "వీర ఘటోత్కచ" లేదా "సురేఖా హరన్" 1949లో వచ్చింది. ఇందులో శశిరేఖగా మీనాకుమారి నటించింది.
తెలుగు, తమిళ భాషలలో కె.వి.రెడ్డి దర్శకత్వంలో 1957లో వచ్చిన ప్రఖ్యాత "మాయాబజార్" దీనిని 1971లో హిందీలోకి డబ్బింగ్ చేశారు.
బాబూభాయి మిస్త్రీ 1958లో తీసిన మాయాబజార్‌లో కధానాయిక అనితా గుహా. తరువాత ఈ సినిమా "వీర ఘటోత్కచ" పేరుతో తెలుగు, తమిళ, కన్నడ భాషలలోకి అనువదింపబడింది.
శాంతిలాల్ సోనీ హిందీలో "వీర్ ఘటోత్కచ" సినిమా తీశాడు.
హిందీలోను, గుజరాతీలోను 1984లో బాబూభాయి మిస్త్రీ "మాయాబజార్" చిత్రం రంగులలో నిర్మించాడు.
ఇదే పేరుతో దాసరి నారాయణరావు ఒక సాంఘిక చిత్రాన్ని నిర్మించాడు.
మరికొన్ని విశేషాలు
మార్చి 2007లో ఈ సినిమాకు 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రముఖ టెలివిజన్ ఛానళ్ళు ప్రత్యేక కార్యక్రమాలను సమర్పించాయి. పత్రికలు విశేష వ్యాసాలు ప్రచురించాయి. పత్రికలలో వచ్చిన శీర్షికలు ఇలా ఉన్నాయి - "యాభై ఏళ్ళ 'మాయా'బజార్", "మనయింటి బంగారం మాయాబజార్", "తెలుగు సినిమాకు పెద్దబాల శిక్ష మాయాబజార్", "అర్ధ శతాబ్ది అద్భుత అనుభూతి మాయాబజార్"
ఎస్.వి.కృష్ణారెడ్డి ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అన్నది - "ప్రేక్షకులు వైవిధ్యం కోరుకుంటారు. మంచి సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తారంటే ఇక మాయాబజార్ తరువాత వేరే సినిమా రానక్కరలేదు"
ఈ సినిమాలో హీరో ఎవరు? అని తెలుగు సినిమా వజ్రోత్సవ సందర్భంలో టీవీ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు అక్కినేని నాగేశ్వరరావు ఇలా జవాబు చెప్పాడు - "డ్యూయెట్ పాడినవాడు హీరో అయితే నేను హీరోను. ఫైట్లు చేసినవాడయితే ఎస్.వీ.రంగారావు. మగవాడు కాని హీరో సావిత్రి...."
'కిన్నెర ఆర్ట్ థియేటర్' వారు మే 2007లొ మాయాబజార్ స్వర్ణోత్సవం సభ ఏర్పాటు చేసి, ఆ సినిమాలో నటించిన నటులను సత్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రఖ్యాత కవి రాళ్ళబండి కవితాప్రసాద్ మాయాబజార్ సినిమా ఇంత ఆదరణ పొందడానికి కొన్ని కారణాలను విశ్లేషించాడు.
పాత్రల ప్రవర్తన: మాయాబజార్‌లో పాత్రలు, వాటి స్వభావాలు మన నిత్యజీవనంలో ఇరుగుపొరుగువారి ప్రవర్తనకు చాలా దగ్గరఱగా ఉన్నాయి. కనుక ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఒక అనుబంధం ఏర్పడింది.
భాష: మాయాబజార్‌లో పాత్రలు మాట్లాడిన భాష గ్రాంధికంలా అనిపించదు. అలాగని ఫక్తు నేటి వ్యావహారికం కాదు. అందుకే ప్రేక్షకులకు ఆ సినిమాలో ప్రతి డైలాగు సుపరిచితమయ్యింది.

అల్లూరి సీతారామ రాజు

బాల్యం
అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న వెంకటరామ రాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంకిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామ రాజు గారి ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.
భారత తపాల శాఖ 1986లో విడుదల చేసిన అల్లూరి సీతారామ రాజు స్మారక తపాళా బిళ్ల
ఆరవ తరగతి చదివుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి ఆర్ధికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలన లేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం ఇలా సాగింది.
1909 లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారం లో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.
రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకను, కలరా వ్యాధి సోకడంతోను పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురం లో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తుని లో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదవేవాడు కాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు, తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి మానేసాడు - శాశ్వతంగా.
రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కల గల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవిపేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.
ఉత్తరదేశ యాత్ర
1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, కాశి, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు.
కృష్ణదేవిపేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. కృష్ణదేవిపేటలోని చిటికెల భాస్కరుడు అనే వ్యక్తి, అతని తల్లి ద్వారా రాజు ఆచూకీ అతని తల్లికి తెలిసి రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు.
రెండవ యాత్ర
1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి, బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైనప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవిపేట చేరాడు. ఆ గ్రామానికి సమీపంలోని తాండవ నది పక్కనే ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు. ఆ ప్రాంతానికి శ్రిరామ విజయనగరం అని పేరు పెట్టాడు. అనేక యుద్ధవిద్యలు, ఆయుర్వేద వైద్య విద్యలోను ప్రావీణ్యుడవటం చేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు.
బ్రిటిషు అధికారుల దురాగతాలు
ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మాన హరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే, వారిపై బ్రిటిషు వారు ఘోరమైన దురాగతాలు చేసారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది. ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వ్వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేది కాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.
వారి కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరం చేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.
గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటిషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.
అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరు గా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్ లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.
విప్లవం మొదటిదశ
పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:
చింతపల్లి
1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై దాడి చేసి, రికార్డులను చించివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.
కృష్ణ దేవి పేట
మరుసటి రోజే - ఆగష్టు 23 - కృష్ణదేవిపేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు.
రాజవొమ్మంగి
ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొర ను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.
వరుసదాడులతో దెబ్బతినిఉన్న బ్రిటిషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధ రీతిలో వీరిపై దాడి చేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకువెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదర భావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.
అడ్డతీగల
రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడి చేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది దళం. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు.
విప్లవం రెండవదశ
డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందని పుకార్లు చెలరేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది.
1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. 1923 జూన్ లో మల్కనగిరి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు.
మన్యంకు కలెక్టరుగా రూదర్‌ఫర్డ్ నియమితుడయ్యాడు. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లు దొర పోలీసులకు దొరికిపోయాడు. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసేవారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని చుట్టుముట్టి దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.
1924 మే 6న అగ్గిరాజు పట్టుబడ్డాడు. ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూదర్‌ఫర్డు నిర్వహించిన కృష్ణదేవిపేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారిని ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. మరుసటి ఉదయం - మే 7 - ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని దహనం చేసారు.
ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామ రాజు అమరవీరుడయ్యాడు.

Tuesday, 3 July 2007
Subscribe to:
Posts (Atom)